Home » New Delhi
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టే ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఈనెల 7వ తేదీ సోమవారంనాడు పెద్దల సభ ముందుకు రాబోతోంది. ఆర్డినెన్స్ స్థానే లోక్సభలో తీసుకువచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ఇప్పటికే విపక్ష సభ్యుల ఆందోళన, వాకౌట్ల మధ్య లోక్సభ ఆమోదం పొందింది.
దేశరాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
న్యాయం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్జే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు.
కాంగ్రెస్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది.
అమరావతి: జగన్ సర్కార్ మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చింది.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు.
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా రకరకాలైన చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటికి ఫుల్స్టాప్ పెడుతూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టమైన ప్రకటన వెల్లడించింది. జమిలీ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పేసింది.
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కొత్తగా అభివృద్ధి చేసిన న్యూ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్ 'భారత్ మండటం' ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారంనాడు ఒక డ్రోన్ ద్వారా ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం 2019లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంతవరకూ అల్లరిమూకలు రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు జరిగిన నష్టం ఎంతో తెలుసా?. రూ.55 లక్షల పైమాటే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు బుధవారంనాడు ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.